calender_icon.png 19 April, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతుచిక్కని కిడ్నీ వ్యాధికి కారణాలు తెలుసుకోండి

19-04-2025 12:58:57 AM

అధికారులకు మంత్రి రాజనర్సింహ ఆదేశం

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాల గురిజాల గ్రామంలో ప్రజలు కిడ్నీ వాధుల బారిన పడుతున్నారన్న అం శంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. గ్రామంలో ఎంతమంది కిడ్నీ వ్యా ధులతో ఇబ్బంది పడుతున్నారో గుర్తించి, అందుకు గల కారణాలను తె లుసుకోవాలన్నారు.

ఆ గ్రామం లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రా మస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధి కారులను ఆదేశించారు.  గ్రామం లో ప్రజలు వినియోగిస్తున్న నీటి నమూనాలను పరీక్షించాలని ఆదేశించారు. రోగులకు అవసరమైన వైద్య సహాయం, మెడిసిన్ ఉచితంగా అందజేయాలని సూచించా రు. పూర్తి వివరాలతో తనకు నివేదిక అందజేయాలని ఆదేశించారు.