- ఎన్డీయే ఖాతాలోకి జార్ఖండ్!
- గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి
- పోల్ సర్వేల అంచనాల్లో వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 20: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సమరం ముగిసింది. ఈ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశముఉంది. జార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే.. అధికార కూటమి జేఎం ఎం గట్టి పోటీ ఇవ్వడమే కాకు ండా ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని సర్వే లు చెబుతున్నాయి.
ఫలితంగా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కే ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజారిటీ ఎన్డీయే కూటమి సాధిస్తుం దని అంచనా వేశాయి. ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలు తెలిపాయి. జమిలీ ఎన్నికలపై ఊహాగానాల నేపథ్యంలో ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.
రెండు రాష్ట్రాల్లోనూ..
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా కావాల్సిన ఆధిక్యం 145. మూడు ఎగ్జిట్ పోల్స్‌లోనూ మహాయుతి కూటమి దాదాపు 158 సీట్లు గెలుస్తుందని చెప్పాయి. మ్యాట్రిజ్ ప్రకారం మహాయుతి 150 సీట్లు, మహావికాస్ అఘాడీ 110 సీట్లు రావచ్చని తెలిపింది. చాణక్య సర్వే ప్రకారం మహాయుతికి 152 నుంచి 160 సీట్లు, ఎంవీఏ 130 టైమ్స్ నౌ అంచనాలో మహాయుతి 159, ఎంవీఏ 116 సీట్లు గెలుచుకుంటాయని తెలిపాయి. జార్ఖండ్‌లోనూ ఎన్డీయే కూటమి మెజార్టీ మార్కు దాటుతుందని సర్వేలు చెబుతున్నాయి.
రెండు కూటముల మధ్యే పోటీ
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు గాను అధికార కూటమి మహాయుతి నుంచి బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. విపక్ష మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ 101, శివసే న(యూబీటీ) 95, ఎన్సీపీ (ఎస్సీపీ) 86 సీట్లలో పోటీ చేశాయి.
బీఎస్పీ ఒంటరిగా 237 స్థానాల్లో, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశా యి. జార్ఖండ్‌లోని 81 సీట్లకు మెజారిటీ మార్కు 41. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ 2, ఎల్జీపీ ఒక చోట పోటీ చేశాయి. ఇండియా కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) 4 స్థానాల్లో పోటీ చేశాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.