calender_icon.png 4 January, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో లీకేజీ!

02-01-2025 12:28:13 AM

మొదటి యూనిట్‌లో వారం రోజులుగా నీటి దార

నాగర్‌కర్నూల్, జనవరి 1 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గత వారం రోజులుగా నీరు లీకవుతూ దారలాగా పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్టులో మొదటి యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ అండర్ గ్రైండ్ ప్రాంతంలో నీరు కారుతున్నట్టు తెలిసింది.

గత నెల రోజులుగా విద్యుత్ ఉత్పత్తి నిర్విరామంగా కొనసాగుతున్న నేపథ్యంలో జనరేషన్ మోడ్, ఆక్టివ్ మోడ్ మార్పు సమయంలో లీకేజీ పెరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నీటి లీకేజీ అంశాన్ని ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నారు. కేవలం మైనర్ లీకేజీ సమస్యగా సీఈ రామసుబ్బారెడ్డి కొట్టిపారేశారు. తరచూ పర్యవేక్షణ జరిపి ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేస్తున్నామన్నారు.