- కేవీకేలో ఆకు కూరలతో భోజనాలు
- హాజరైన డీడీఎస్ మహిళా రైతులు
సంగారెడ్డి(విజయక్రాంతి)/జహీరాబాద్, ఆగస్టు 25: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని కేవీకే డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (పస్తాపూర్)లో ఆదివారం మహిళా రైతులు ఆకుకూరల పండుగ నిర్వహించారు. పలు గ్రామాల రైతులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులకు పోషకాహారం గురించి వివరించారు. ఝరాసంగం మండలంలోని పోట్‌పల్లి గ్రామంలో మహిళా రైతులు ప్రకృతి సిద్ధంగా సాగు చేస్తు న్న జీవవైవిద్య పంటలను పరిశీలించారు. కేవీకీలో 40 రకాలకు పై ఆకు కూరలతో వంటలు చేశారు. ఆకు కూరలతో భోజనం చేశారు. డాక్టర్ సలోమి యేసుదాస్ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం సాగు చేయని ఆకు కూరలపై పరిశోధన ప్రారంభించామన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ న్యూట్రీషన్ (ఎన్‌ఐఎన్) వారితో పరిశోధన చేశామన్నారు. పాలకూర, కొత్తమీర, ఉసిరిలో ఉండే పోషకాల కంటే ప్రకృతి లో పెరిగిన ఆకు కూరల్లో అధిక పోషకాలు ఉన్నాయని తెలిసిందన్నారు.