లీడ్స్, జూలై 19: యూకేలోని లీడ్స్ అల్లర్లతో అట్టుడికింది. గురువారం ఆం దోళనకారులు ఓ డబుల్ డెక్కర్ బస్సు కు నిప్పు పెట్టడంతో పాటు అనేక వా హనాలను ధ్వంసం చేశారు. భారీ సం ఖ్యలో ఆందోళనకారులు రా వడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. హేర్‌హిల్స్ ఏరియాలో అల్లర్లు చోటు చేసుకున్నాయి.
కారణం ఇదే..
లీడ్స్ అల్లర్లకు అధికారుల తీరే కారణం అని తెలుస్తోంది. ఆ ప్రాం తంలో ఉండే సోషల్ సర్వీసెస్ సిబ్బంది ఓ కుటుంబం నుంచి నలుగురు పిల్లలను తీసుకెళ్లడంతో రచ్చ మొదలయింది. అనేక మంది అక్కడకు చేరుకుని నిరసనకు దిగారు. భారీ సంఖ్యలో జనాలు అక్కడకు చేరుకున్నారు. అదుపు చేసేందుకు పోలీసులు ఎంత ట్రై చేసినా కానీ ఫలితం లేకపోయింది. సంయమనం పాటించాలని హోం మంత్రి కూపర్ ప్రజలను అభ్యర్థించారు.