calender_icon.png 24 November, 2024 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి

24-11-2024 02:25:05 AM

21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 23 (విజయక్రాంతి): విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగవచ్చని 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి.కృష్ణ ప్రదీప్ అన్నారు. సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, జీ మీడియా గ్రూప్, కేపీ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఫస్ట్ అటెంప్ట్‌లో సివిల్ సర్వీసెస్ ఎలా క్రాక్ చేయాలి.. యూపీఎస్సీ మాస్టర్ క్లాస్ అనే పేరుతో మేడ్చల్‌లో శనివారం నిర్వహించిన సెమినార్‌లో కృష్ణ ప్రదీప్ పాల్గొని మాట్లాడారు.

సివిల్ సర్వెంట్స్‌కి ఉన్న అధికారంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చంటూ హరియాణా మాజీ  ముఖ్యమంత్రిని వ్యతిరేకించి తన నైతికతను నిరూపించుకున్న ఐఏఎస్ అధికారిని రజనీ సేఖరి సిబాల్ గురించి విద్యార్థులకు వివరించారు. ఆమె చూపించిన ధైర్యం 2013లో ఆ ముఖ్యమంత్రిని జైలుకు వెళ్లేటట్టు చేసిందన్నారు. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా అలాంటి ధైర్యాన్ని పుణికుపుచ్చుకోవాలన్నారు. తదనంతరం 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెంటార్ డాక్టర్ భవానీశంకర్, సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ డైరెక్టర్ డా.రాజిరెడ్డి, డా. శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 21 ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఫైనాన్స్ డైరెక్టర్ వరుణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.ప్రశాంత్, జీ మీడియా గ్రూప్ డైరెక్టర్ గిరి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.