02-04-2025 12:31:59 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): మంత్రి పొన్నం ప్రభాకర్, టి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
బుధవారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న బీసీల మహా ధర్నా కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, శ్రీహరి, ప్రకాష్ గౌడ్, ఇతర బిసి ప్రజాప్రతినిధులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దేశ రాజధానికి విమానంలో వెళ్లారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమంలో రాష్ట్రం నుంచి అన్ని బీసీ సంఘాలు పెద్దఎత్తున్న హాజరై విజయశంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.