కాప్రా: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మలుపు తిప్పిన దీక్ష దివస్ ను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ వద్ద నిర్వహించిన దీక్షా దివాస్ కు రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్ రావు నగర్, హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, పాన్నాల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జన శేఖర్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, సీనియర్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీక్షా దివస్ లో భాగంగా కెసిఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పది డివిజన్లో చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.