calender_icon.png 11 February, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ నామినేషన్‌కు తరలిన నేతలు

11-02-2025 12:58:00 AM

అర్మూర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి) : మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ కు అర్మూర్ నేతలతో పాటు జిల్లా నేతలు సోమవారం తరలి వెళ్లారు.

ఆయనకు పెద్ద మొత్తంలో మద్దతు ఇవ్వడానికి నిజామాబాద్ జిల్లా నుండి పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి,  బోధన్ శాసన సభ్యుడు  ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి  నాయకత్వంలో జిల్లా నేతలు తరలి వెళ్లారు.

రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హందన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రోద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజా రెడ్డి,  జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద మొత్తం లో పాల్గొని నామినేషన్ ర్యాలీకి తరలి వెళ్లారు.రాష్ట్ర మంత్రి  దుద్ధిల్ల శ్రీధర్ బాబు కలిసి నియోజకవర్గ సమస్యలను విన్నవించి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వినయ్ రెడ్డి తెలిపారు.