మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్
మోతే విజయ క్రాంతి జనవరి 31:- శుక్రవారం మోతే మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ.. పార్టీ మారిన నాయకులకు బుద్ధి చెప్పాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
420 రోజులు గడుస్తున్నా రైతు భరోసా ఇవ్వలేదని అన్నారు.రైతు బందు సంవత్సరానికి రెండు విడతలుగా క్రమం తప్పకుండా ఎకరాకు 10 వేల చొప్పున మొత్తం 73,162 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసిన ఘనత మా కేసిఆర్ దే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, మండల నాయకులు, మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.