12-02-2025 12:00:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): తెలంగాణ కాటన్ అసోసిషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, ప్రధా కార్యదర్శి కక్కిరాల రమేష్, సంయుక్త కార్యదర్శి కట్కూరి నాగభూషణం మంగళవారం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో కలిశారు.
దేశంలోనే పత్తి ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉ తెలంగాణలో ఉత్పత్తి అయిన 45 లక్షల బేళ్ల పత్తిలో 90 శాతం పత్తిని మద్దతు ధరతో సీసీఐ ద్వారా కొని, 3-4 రోజుల్లోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయించినందుకు మం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం నుంచి పత్తి ఎగుమతులు సజావుగా సాగేలా గతంలో హైదరాబాద్‌లో సీసీఐకి ఎకరం స్థలం కేటాయిస్తూ గతం తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయించాలని కోరారు.
వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి కేటాయించిన 35 గుంటల స్థలానికి నామమాత్రపు లీజు రేటును నిర్ణయించి నిర్మాణానికి అనుమతివ్వాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి, మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.