calender_icon.png 2 February, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

02-02-2025 06:31:47 PM

మంచిర్యాల (విజయక్రాంతి): పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు ఊరటను కలిగిస్తూ రూ. 12 లక్షల ఆదాయం పన్ను మినహాయింపు కల్పించడాన్ని స్వాగతిస్తూ ఆదివారం బిజెపి జిల్లా కార్యాలయంలో నాయకులు పీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ప్రధానంగా మధ్య తరగతి ప్రజలకు మేలు చేసి విధంగా, వారు ఆర్థికంగా ఎదగడానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చారన్నారు.

అదే విధంగా బడ్జెట్ లో విద్యా, వైద్యం, పారిశ్రామిక రంగం, పట్టణ గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాలు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించారన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం పేద ప్రజల సంక్షేమానికి, దేశ అభివృద్ధికి బడ్జెట్ కేటాయిస్తే అది జీర్ణించుకోలేక బీజేపీ పార్టీ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, జోగుల శ్రీదేవి, బియ్యాల సతీష్ రావు, తోట మల్లికార్జున్, రెడ్డిమళ్ల అశోక్, రాజేష్ రెన్వా, చిరంజీవి, మేన సూరి, అర్ణకొండ శ్రీనివాస్, దేవరకొండ వెంకన్న, అరెందుల శ్రీనివాస్, తరుణ్ సింగ్, శివ తదితరులు పాల్గొన్నారు.