calender_icon.png 30 November, 2024 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గులాబీ శ్రేణుల దీక్షా దివస్

30-11-2024 02:21:27 AM

  1. పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం
  2. కేసీఆర్ ఉద్యమస్ఫూర్తిని కొనియాడిన నేతలు
  3. ఆటపాటలు, డప్పుల దరువు, కోలాటం మధ్య ర్యాలీలు
  4. ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్స్.. 

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రంలోని 33 జిల్లాల పార్టీ కార్యాలయాల్లో గులాబీ శ్రేణులు ‘దీక్షా దివస్’ నిర్వహించాయి. కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు నేతృత్వం వహించారు. పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

హైదరా బాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, నిజామాబాద్‌లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం గురించి పార్టీ కార్యకర్తలకు వివరించారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో శాసనమండలి పక్షనేత మధుసూదనచారి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రోగులకు పం డ్లు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయ దీక్షా దివస్‌లో మాజీ మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు.

ఖమ్మం కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి హాజరయ్యారు.

జనగామ ఆర్టీసీ చౌరస్తాలో నిర్వహించిన దీక్షా దివస్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.

కామారెడ్డిలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆ ర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ పాల్గొన్నారు. మెదక్ దీక్షా దివస్‌లో మాజీ ఎమ్మె ల్యే, పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, నిర్మల్‌లో ఎమ్మెల్సీ భైరి సుభాశ్‌రెడ్డి, వికారాబాద్‌లో పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు.