calender_icon.png 27 December, 2024 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన యాదవ సంఘం నాయకులు

07-11-2024 04:04:02 PM

మంథని (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును పెద్దపల్లి జిల్లా అఖిల భారత యాదవ సంఘం నాయకులు మంథనిలో గురువారం ఘనంగా సన్మానించారు. సదర్ వేడుకలను రాష్ట్ర పండుగ గుర్తించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, ముఖ్య పాత్ర పోషించిన మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రివర్గానికి యాదవ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మేకల మల్లేష్ యాదవ్, జిల్లా నాయకులు రాజేందర్ యాదవ్, తోట్ల తిరుపతి యాదవ్, నాయకులు పర్వతాలు యాదవ్, రాములు యాదవ్, లింగయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మోహన్ యాదవ్, మల్లేష్ యాదవ్, గట్టయ్య యాదవ్, డివిజన్, మండల యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు,