calender_icon.png 20 September, 2024 | 3:13 PM

ప్రారంభించారు సరే.. విద్యార్థుల ప్రవేశాలు ఎపుడు... ?

20-09-2024 12:56:51 PM

ప్రజా సంఘాల నాయకులు 

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జల్లా కేంద్రంలో ప్రభుత్వ డైట్ కలశాలను జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సంబంధిత అధికారులతో కలిసి ఇటీవల ప్రారంభించారు కానీ నేటి వరకు ఆ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభించలేదని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం ప్రజాసంఘాల నాయకులు డైట్ కళాశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా కేవీపీయస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు గేడం  తికనంద్,గుడిసెల కార్తీక్ టీఏజిఎస్ జిల్లా అధ్యక్షురాలు కోరంగేమలశ్రీ. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు భీమ్ రావు మాట్లాడుతూ.. మారుమూల జిల్లాకు విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వ డైట్ కళాశాల మంజూరు చేయడం ఆహ్వానిస్తున్నాము. నేటికీ ఆ కళాశాలకు అధ్యాపకులను భర్తీ చేయలేదని అన్నారు.

అంతే కాకుండా విద్యార్థుల ప్రవేశాలు కూడా చెప్పాట్టడం లేదని కోట్ల రూపాయలతో భవనం కట్టి ప్రారంభించడం వలన విద్యార్థులకు  ఏం లాభం అని ప్రశ్నించారు.  కళాశాలకు సరైన రోడ్డు మార్గం లేదని వెంటనే రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్  చొరవ తీసుకొని వెంటనే ప్రభుత్వ డైట్ కళాశాలలో అధ్యాపకులను నియమించి విద్యార్థులకు ప్రవేశాలు కలిపించి తరగతులు ప్రారంబించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు శ్రావణి ఉన్నారు.