calender_icon.png 26 December, 2024 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల సింహ గర్జనకు తరలిన మాల మహానాడు నాయకులు

01-12-2024 04:42:22 PM

గజ్వేల్ (విజయక్రాంతి): హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాల సింహగర్జనకు ఆదివారం గజ్వేల్ నుండి మాలలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాలలు తెలంగాణ రాష్ట్రములో అత్యధికంగా ఉన్నారన్నారు. మాలల చరిత్ర ఎవరు చేరిపివేయలేరన్నారు. మాలలకు జరుగుతున్న జరుగుతున్న ఆర్థిక, సామాజికంగా, రాజకీయ అన్యాయాలకు ఎదిరించడానికి ఈ మాలల బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు చిప్పల యాదగిరి, ఏఎంఎస్ఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బండారు దేవేందర్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు మన్నె కృపానందం, మాలమహానాడు నాయకులు గంట సత్యనారాయణ, కుక్కల శ్రీనివాస్, ఎడ్ల భూమయ్య, మంగోల్ అనిల్, తుమ్మ యాదగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.