బెల్లంపల్లి,(విజయక్రాంతి): కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం సోమవారం మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎం.వి నర్సింగరావు, ఇంజనీరింగ్ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. గ్రామ పంచాయతీ భవనం లేక టేకులపల్లి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. త్వరలోనే గ్రామపంచాయతీ భవనాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వార్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పప్పుల శ్రీ రామాంజనేయులు పాల్గొన్నారు.