calender_icon.png 28 April, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో లీడర్లదే పెత్తనం

26-04-2025 12:00:00 AM

నిరుత్సాహంతో గోడును వెల్లబోసుకున్న గ్రామస్థులు

చింతలమనేపల్లి, ఏప్రిల్25 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో లీడర్లదే అవాహ నడుస్తుందని ప్రజలు నిరుత్సా హంతో తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. శుక్రవారం మండలంలోని విందా గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇళ్ల జాబితాను చదివి వినిపించకపోగా మాజీ సర్పంచ్ చేతిలో జాబితాను పెట్టి వెళ్లిపోయాడు.

దీంతో నిరుత్సాహం చెందిన గ్రామ ప్రజలు తమ గోడును వినిపించారు. సాయంత్రం మూడు గంటల వరకు గ్రామపంచాయతీ కా ర్యాలయం వద్ద ప్రజలు ఎదురుచూసి చేసేది ఏమీ లేక వెళ్లిపోయారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పెత్తనం చేస్తున్న మాజీ ఉపసర్పం చ్, పంచాయతీ కార్యదర్శిపై  చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో నారాయణ, వెంకటేశ్వర్లు, సోమ య్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.