10-03-2025 03:21:48 PM
మంథనిలో సావిత్రి భాయి వర్థంతి వేడుకల్లో ప్రజాసంఘాల నాయకులు
మంథని,(విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అట్టడుగు వర్గాలకు అక్షరాస్యత నేర్పిన ఆశాజ్యోతి మహిళా చైతన్య స్ఫూర్తి ప్రదాత ఆదర్శనీయురాలు సావిత్రిబాయి పూలే అని మంథనికి చెందిన ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు. సోమవారం 128వ వర్ధంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంథని పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ... ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క మహిళా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఆమె బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బెజ్జంకి . డి గంబర్, (కెవిపిఎస్) మండల బాధ్యులు మంథని లింగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బూడిద తిరుపతి, గుడ్ల గురువేష్, సిపిఎం నాయకులు బూడిద గణేష్, బా వు.రవి, మంథని కిష్ట స్వామి, కడారి సతీష్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, గొర్రెం, కళ సురేష్ పాల్గొన్నారు.