calender_icon.png 11 March, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ వధువుతో నాయకుడు జంప్

10-03-2025 10:04:26 PM

ఆయనకు పెళ్లయి ఇప్పటికే కూతురు...

యువతిని ఆలయానికి రప్పించుకొని తీసుకెళ్లాడు..

లంగర్ హౌస్ లో సదరు నాయకుడి ఫొటోకు చెప్పుల దండ..

నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ఓ నాయకుడికి పెళ్లై సుమారు 10 ఏళ్ల కూతురు ఉంది. అయినా అతడు వక్ర బుద్ధి చూపించాడు. బస్తీలో ఉండే ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు. ఆమెకు ఇటీవల వివాహమైంది. ఆలయానికి భద్రత వచ్చిన ఆమెను అక్కడ నుంచి తీసుకొని పరారయ్యాడు. సదరు నేత చేసిన నిర్వాకానికి అతడి ఫోటోకు లంగర్ హౌస్ లో చెప్పుల దండ వేశారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్వాన్ నియోజకవర్గంలోని గోల్కొండ డివిజన్ ఓ పార్టీ మాజీ అధ్యక్షుడు గురజాల అరవింద్ (46) రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతర బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అరవింద్ కు భార్య, ఓ కూతురు ఉంది.

ఇదిలా ఉండగా లంగర్ హౌస్ గొల్ల బస్తిలో నివసించే ఓ యువతితో గత కొన్ని ఏళ్లుగా సన్నిహితంగా ఉంటూ ప్రేమాయణం సాగించాడు. సదరు యువతికి అత్తాపూర్ కు చెందిన యువకుడితో 15 రోజుల క్రితం వివాహం అయింది. శనివారం నవ వధువును బండ్లగూడలోని సమీపంలోని ఆరె మైసమ్మ దేవాలయం వద్దకు పిలిచాడు. అక్కడికి వచ్చిన యువతిని తీసుకొని అరవింద్ పారిపోయాడు. ఈ విషయం దావనంలా వ్యాపించడంతో లంగర్ హౌస్ లో కలకలం రేగింది. అరవింద్ ఫోటోను చెప్పుల దండతో బస్తీలో పెట్టి ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు. 

నార్సింగి ఠాణాలో కేసు నమోదు... 

నవవధువును శనివారం గురజాల అరవింద్ కాళీ మందిర్ నుంచి తీసుకెళ్లడంతో ఆమె కుటుంబ సభ్యులు అదే రోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సోమవారం వెల్లడించారు.