calender_icon.png 9 January, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుడిపై నాయకుడి దౌర్జన్యం

01-01-2025 01:03:10 AM

కరీంనగర్, డిసెంబరు 31 (విజయ క్రాంతి): కరీంనగర్ సమీపంలోని రేకుర్తి పాతవాడ ఎస్సీ కాలనీలో నూతనంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి ప్రారంభిం చడానికి సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్ ఎస్ పార్టీకి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు కాంట్రాక్టర్ వద్ద పని చేసే సాయి అనే వికలాంగుడిపై దాడి చేశా డు.

ఎస్సీ కాలనీలో విద్యుత్ సమస్య తీవ్రం గా ఉండడంతో ఇటీవలే కూరగాయలు అమ్మే ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. మంగళవారం ట్రాన్స్ ఫా ర్మర్ వద్ద కొబ్బరికాయ కొట్టి కాలనీకి కనెక్ష న్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న రుణంలో బీ ఆర్‌ఎస్ నాయకుడు అక్కడికి వచ్చి నానా హంగామా చేసి ట్రాన్స్ ఫార్మర్ తమ వారికి చెందిన భూమి వద్ద ఏర్పాటు చేశారని, అ డ్డంగా ఉందని, జేసీబీతో కూల్చివేస్తానని హెచ్చరించడమే కాకుండా వికలాంగుడిపై దాడి చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కాంట్రాక్టర్ వద్ద పనిచేసే సాయి ఫి ర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.