calender_icon.png 30 April, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా కమిషన్ ఎదుట హాజరైన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

29-04-2025 10:11:40 PM

ఎల్బీనగర్: హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్(Corporator Banoth Sujatha Naik) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) మంగళవారం మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద నోటీసు ఇవ్వడంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి‌ వివరణ ఇచ్చారు. కమిషన్ కు రాతపూర్వక వివరణ అందజేశారు. మహిళల పట్ల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉపయోగించిన భాషను సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ సుధీర్ రెడ్డిని పలు ప్రశ్నలు అడిగారు. సుధీర్ రెడ్డి వివరణపై మహిళా కమిషన్ తదుపరి చర్యలు తీసుకోనున్నారు.