12-04-2025 12:05:25 AM
- డిప్యూటీ కమిషనర్ కు కమిషనర్ సన్మానం
ఎల్బీనగర్, ఏప్రిల్ 11 : జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్ జోన్ లోని ఎల్బీనగర్ సర్కిల్ - 4 లో ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి మించి అధికంగా ఆస్తి పన్ను వసూలు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరం టార్గెట్ మించి 104శాతం ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ చేసినందుకు ఎల్బీనగర్ జోనల్ డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్, ఏఎంసీ ఇన్ చార్జి సకినా ఫాతిమా ను శుక్రవారం కొమురం భీమ్ భవనంలో జరిగిన కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అభినందించి, సన్మానించారు.