ఉద్యోగుల పనితీరు మెరుగుపడకపోవడమే కారణం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: పనితీరు సరి గా లేని కొందరు ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ వేటు వేసింది. ఈ విషయాన్ని జాతీయ మీడియా తన తాజా కథనా ల్లో వెల్లడించింది. మీ పోజిషన్‌కు తగినట్టు పనితీరులో కనీస ప్రమాణాలు అందుకోలేదనీ అందువల్లే జాబ్ నుం చి తొలగిస్తున్నట్టు సదరు ఉద్యోగుల కు పంపిన లేఖలో తెలిపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సంస్థకు సం బంధించిన అన్ని డ్యూటీల నుంచి రిలీ వ్ చేసినందువల్ల మైక్రోసాఫ్ట్ సిస్టమ్‌లు, అకౌంట్లు, భవనాల్లోకి అనుమతి ఉండదని.
ఈ సందర్భంగా సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో మళ్లీ కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుం టే సదరు ఉద్యోగి గత పనితీరును, టర్మినేషన్‌కు గురైన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కాగా ఇటీవల మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ డివైజ్, సేల్స్, గేమింగ్ విభాగాల్లోని ఉద్యోగులపై కూడా వేటు వేసిన విషయం తెలిసిందే.