* పునరుద్ధరణ చర్యల్లో భాగమేనని సంస్థ ప్రతినిధి వెల్లడి
న్యూయార్క్, జనవరి 30: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. కమ్యూనికేషన్ విభాగానికి చెంది న ఉద్యోగులను తొలగించేపనిలో ఉంది. సంస్థ కార్యకలాపాలను చక్కబెట్టడంతోపాటు ఖర్చులను తగ్గించుకునేందుకే ఉద్యో గులపై వేటు వేస్తున్నట్లు చెబుతున్నారు.
కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కంపెనీ విస్తృత వ్యూహంలో భాగంగా ఈచర్యలు చేపడుతున్నట్టు కంపెనీ ప్రతినిధి బ్రా డ్ గ్లాసర్ చెప్పారు. ఉద్యోగుల తొలగింపు వాస్తవమేనని, అయితే ఈ నిర్ణయం అంత ఈజీ కాదని తెలిపారు. తొలగించే ఉద్యోగులకు తాము తగిన సాయం అందిస్తామని చెప్పారు. ఈసారి ఎంతమందిపై ఈ ప్రభావం ఉంటుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.