calender_icon.png 3 March, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెజాన్‌లో మరోసారి తొలగింపులు

31-01-2025 01:26:06 AM

 వాషింగ్టన్ : ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. తాజా రౌండ్ తొలగింపులో కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఉద్యోగులను ఇంటికి  పంపనుంది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు ఖర్చుల్ని తగ్గించేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది.

అందులో భాగంగా తాజా తొలగింపులు చేపట్టనుంది. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కంపెనీ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ చర్యలు చేపడుతోంది.అమెజాన్ కార్యకలాపాలు చురుగ్గా సాగడానికి ‘లే ఆఫ్‌లు’ దోహదపడతాయని కంపెనీ పేర్కొంది. లేఆఫ్‌ల్లపై కంపెనీ ప్రతినిధి బ్రాడ్ గ్లాసర్ స్పందించారు.

ఉద్యోగుల తొలగింపు నిజమేనని పేర్కొన్న ఆయన ఈ నిర్ణయం సులభమైనది కాదన్నారు. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు, ఉనికిని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం సాయపడుతుందన్నారు. లేఆఫ్‌ల కారణంగా ప్రభావం ఎదుర్కోనున్న ఉద్యోగులకు తాము సాయం అందిస్తామని ఆయన తెలిపారు.అమెజాన్ సీఈఓగా ఆండీ జస్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కంపెనీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా లేఆఫ్‌లను ప్రకటిస్తూనే వచ్చారు.