calender_icon.png 12 February, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైసూరు ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో400 మంది ట్రైనీల లేఆఫ్

08-02-2025 12:30:33 AM

మైసూరు: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఉద్యోగులకుషాక్ ఇచ్చింది. రెండేళ్ల క్రితం ఫ్రెషర్ల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించిన ఇన్ఫీ.. గతేడాది వారిని విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా అందులోని కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు  క్యాంపస్‌లో ్ల శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు లేఆఫ్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. వరుసగా మూడు సార్లు అంచనా పరీక్షల్లో విఫలమైన కారణంగా వారిని తొలగిస్తున్నట్లు తెలిసింది.

ట్రైనీలను 50 మందితో కూడిన బ్యాచ్‌లుగా పిలిచి వారితో మ్యూచువల్ సెపరేషన్ లెటర్లపై సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు ట్రైనీలంతా క్యాంపస్ ను వీడాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది. అయితే, ట్రైనీల తొలగింపుపై ఇన్ఫీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.