02-09-2024 02:40:14 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు లక్ష్మణ్ ఎన్నికయ్యారు. అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి అధ్యక్షతన 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సమావేశమై లక్ష్మణ్‌ను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. లక్ష్మణ్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఆయన ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా సేవలందించా రు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీరెల్లి కమలాకర్‌రావు ఉద్యోగ విరమణతో ఈ పోస్టు ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ రాష్ట్ర శాఖకు ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటివరకు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు మోహ న్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, పీఆర్‌టీయూ మాసపత్రిక ప్రధాన సంపాద కులు ఇన్నారెడ్డి పాల్గొన్నారు.