నిజామాబాద్, నవంబర్ 26: నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మహ్మద్ ఖాసీమ్‌పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్‌గౌడ్ డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ న్యాయవాదులు మంగళవారం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు.
నిందితులు హర్షత్ఖాన్, ముజాఫర్‌ఖాన్, ముజాయిద్ఖాన్లను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. న్యాయవాదులు రాస్తారోకో నిర్వహిండంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది.