calender_icon.png 31 March, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లు ఆమోదంపై న్యాయవాదుల హర్షం

21-03-2025 01:19:40 AM

రంగారెడ్డి జిల్లా కోర్టులో సంబురాలు 

ఎల్బీనగర్, మార్చి 20 : అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం న్యాయవాదులు సంబురాలు నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు మాట్లాడుతూ...  బీసీ బిల్లు ఎవరికి వ్యతిరేకం కాదని,  న్యాయంగా బీసీ సమాజానికి సంబంధించిన వాటా అన్నారు.  బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదించేలా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని కోరారు. విద్య, ఉద్యోగ, చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి  పొన్నం ప్రభాకర్ గౌడ్ తోపాటు ఇతర మంత్రులు, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు, రంగారెడ్డి జిల్లా కోర్టు  జనరల్ సెక్రెటరీ ఐఎల్పీఏ ప్రెసిడెంట్ పొన్నం దేవరాజ్ గౌడ్, న్యాయవాదులు జిల్లా రమేశ్, బొడ్డు భిక్షపతి గౌడ్, శంకరయ్య, భిక్షమయ్య, బర్ల సునీత, కేరిత్, అనసూయ తదితరులు పాల్గొన్నారు.