24-04-2025 02:28:58 PM
నల్ల బ్యాడ్జీలతో నిరసన
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు. పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చంపడాన్ని ఖండించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతులకు న్యాయవాదులు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి చేను రవికుమార్, సీనియర్ న్యాయవాదులు గోపి కిషర్ సింగ్, ఎల్ రాము, పసుల సురేష్, అశోక్,సంగతి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.