calender_icon.png 26 April, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్ల బ్యాడ్జీలతో న్యాయవాదుల నిరసన

26-04-2025 12:33:36 AM

అర్మూర్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి సంఘటనపై రాష్ట్ర బార్ కౌన్సిల్ పిలుపుమేరకు శుక్రవారం ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ హాల్ నందు సమావేశమై న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అమాయకమైనటువంటి ప్రజలపైన, పర్యాటకుల పైన ఉగ్రవాదులు దాడి చేయడానన్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానించారు.

అలాంటి ఉగ్రవాదులను వెంటాడి, వేటాడి శిక్షించవలసిన అవసరం ఈ దేశ ప్రభుత్వంపై ఉందని. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా  కఠినమైనటు వంటి చట్టాలు చేస్తూ నియంత్రించాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అనిచివేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా బార్ సభ్యులు తెలియజేయడమైనది.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ఉపాధ్యక్షుడు గటడి ఆనంద్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, కోశాధికారి చైతన్య, గ్రంథాలయ కార్యదర్శి శ్రావణ్, ఏజీపీ చిన్నారెడ్డి, న్యాయవాదులు తెడ్డు నర్సయ్య, దేవన్న, బొట్ల జీవన్, ప్రవీణ్ చందర్, గోవిందరాజు, బబ్లు పాల్, బాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.