calender_icon.png 25 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రదాడిని నిరసిస్తూ న్యాయవాదుల నిరసన

25-04-2025 04:26:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో అమాయక ప్రజలపై ఉగ్రదాడిని నిర్వహించిన ఉగ్రవాదులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని నిర్మల్ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేశారు. శుక్రవారం ఉగ్రదాడిని నిరసిస్తూ కోర్టు ఆవరణ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరోధాలు చేశారు. ఈ దాడిని న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు శాంతి కలిగించాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ న్యాయవాదులు పాల్గొన్నారు.