19-04-2025 12:29:08 AM
నిజామాబాద్ ఏప్రిల్ 18: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా జిల్లా న్యాయాధికార సేవా సంస్థ సమావేశం హాల్లో న్యాయవాదులు శాలువాలు కప్పి మెమెంటో అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల్లో జిల్లా ప్రజలతో మమేకమై న్యాయ సేవలు అందించడం అభినంద నీయమని రాబోయే రోజుల్లో ప్రజలకు సత్వర న్యాయం అందించిన కృషి చేయాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి డిఫెన్స్ కౌన్సిల్స్ రాజ్కుమార్ సుబేదార్ ఉదయ్ కృష్ణ ప్రమోద్ ప్రమోద్ విష్వక్ సేన్ రవిబాబు ఖలీద్ మహిపాల్ డి ఎల్ ఎస్ ఏ సిబ్బ పర్యవేక్షకురాలు శైలజ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు