calender_icon.png 27 November, 2024 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

27-11-2024 03:43:07 PM

కామారెడ్డి, (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీనియర్ న్యాయవాది కాసింపై జరిగిన భౌతిక దాడిని నిరసిస్తూ కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి బిచ్కుంద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది పాసింపై జరిగిన భౌతిక దాడిని ఖండించారు. కామారెడ్డి లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ బాన్సువాడలో బార్ అ సోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి  తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై భౌతిక దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డిలో న్యాయవాదులు వీఎల్ నరసింహారెడ్డి, జగన్నాథం, రమేష్ చంద్, చింతల గోపి, సిద్ధిరాములు, దేవరాజు గౌడ్ బాన్స్ వాడలో న్యాయవాదులు రమాకాంత్, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, రామ్ రెడ్డి, ఖలీల్, మొగులయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.