calender_icon.png 20 April, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదులు విధుల బహిష్కరణ

18-04-2025 12:00:00 AM

లక్షెట్టిపేట, ఏప్రిల్ 17: కోదాడ న్యాయవా ది కిశోర్‌పై జరిగిన దాడికి నిరసనగా లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురు వారం కోర్ట్ విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమిరెడ్డి సత్తన్న మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. న్యాయవాదులపై దాడి చేయకుండా ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఎస్. ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షుడు నలినికాంత్, కోశాధికారి సుమన్ చక్రవర్తి , లైబ్రరీ సెక్రటరీ షెఫీఖ్, స్పోరట్స్ సెక్రెటరీ బనావత్ సంతోష్, లేడీ రెప్రెసెంటేటివ్ జి. పద్మ ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రహేమతుల్లా, రెడ్డిమల్ల ప్రకాశం, సదాశివ, సీనియర్ న్యాయవాదు లు భూమరెడ్డి, కిరణ్, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, న్యాయవాదులు తాజోద్దీన్, రుమాన్, ఆనంద్ పాల్గొన్నారు.