calender_icon.png 26 March, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల విధుల బహిష్కరణ..

25-03-2025 06:58:47 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): హైదరాబాద్ లో న్యాయవాది ఇజ్రాయెల్ ఎర్ర బాబు హత్యకు నిరసనగా మంగళవారం స్థానిక న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడికొప్పుల కిరణ్ మాట్లాడుతూ... న్యాయవాదిని హత్య చేయడం హేయమైన చర్య అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణకు వెంటనే ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయాన్ని రక్షించే న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు సామాన్యులకు ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొంతకాలంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే న్యాయ వ్యవస్థ ఉనికికే ప్రమాదంగా మారనున్నదన్నారు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బార్ అసోసియేషన్ తెలిపింది. ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు గాండ్ల సత్యనారాయణ, రాజేశ్వర్ రావు, భూమ్ రెడ్డి, కోమిరెడ్డి సత్తన్న, కారుకూరి సురేందర్, గోవిందా రావు, గుండారపు పద్మ, ప్రదీప్, మల్లికార్జున్, రెడ్డిమల్ల ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.