calender_icon.png 26 March, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల కోర్టు బహిష్కరణ..

25-03-2025 05:45:51 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ చెందిన న్యాయవాది ఇజ్రాయిల్ పై పాశవికంగా దాడి చేసి హత్య చేసిన హంతకున్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ హుజురాబాద్ బార్ అసోసియషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో మంగళవారం విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... న్యాయవాదులపై జరిగే దాడులను అరికట్టేందుకు న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని వెంటనే  తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి మట్టెల తిరుపతి, ఉపాధ్యక్షులు బండి రమేష్, న్యాయవాదులు భగవాన్ రెడ్డి విజయ రెడ్డి, ముక్కెర రాజు, శ్రీధర్ బాబు, లక్ష్మణ మూర్తి, బత్తుల తిరుపతి, విక్రం, ముచ్చ దివ్య, భానుకిరణ్, హరికిషన్,  తదితరులు పాల్గొన్నారు.