calender_icon.png 24 April, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదులు విధులు బహిష్కరణ

24-04-2025 05:49:30 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): జమ్మూకాశ్మీర్ లోని పహల్గావ్ లో మంగళవారం అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన పాశవిక ఉగ్రదాడికి నిరసనగా న్యాయవాదులు గురువారం కోర్ట్ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న మాట్లాడుతూ.... పాకిస్థాన్ ఉగ్రవాదులను తీవ్రంగా శిక్షించి, భారతదేశం ధీటైన సమాధానం ఇస్తుందని ఇలాంటి దాడులను భారతదేశం సహించబోదని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జెనరల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్, మాజీ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడు నళినీకాంత్, పద్మ, సంతోష్,రెడ్డిమల్ల ప్రకాశం, తిప్పని రవికుమార్, అక్కల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.