calender_icon.png 5 December, 2024 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్మయ్ కేసు వాదించేందుకు లాయర్ల వెనుకంజ

04-12-2024 12:41:25 AM

*బెయిల్ విచారణ వచ్చే నెలకు వాయిదా

ఢాకా, డిసెంబర్ 3: ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్ట్ చేయగా.. అతడి బెయి ల్ పిటిషన్‌పై వాదించేందుకు లాయ ర్లు ముందుకురావడం లేదని తెలుస్తోంది. కృష్ణదాస్ కేసును వాదించేం దుకు ముందుకొచ్చిన ఓ న్యాయవాదిపై ఆందోళనకారులు తీవ్రంగా దాడి చేయగా, ప్రస్తుతం అతడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళ నకరంగా ఉందని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారామన్ దాస్ వెల్లడించారు. ఆందోళనకారులు అంతటితో ఆగకుండా న్యాయవాది ఇంటిపై సైతం దాడి చేశారని దాస్ పేర్కొన్నారు.

రవీంద్ర ఘోష్ అనే మరో లాయర్ కేసును వాదించేందుకు దాదాపు 250 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే స్థానికులు అతన్ని కోర్టు ఆవరణలోకి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో చిన్మయ్ తరఫున కేసు వాదించేందుకు లాయర్లు భయపడుతున్నారని తెలిపారు. కాగా బెయిల్ విచారణను బంగ్లాదేశ్ కోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.