calender_icon.png 3 April, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ ముట్టడికి లాయర్ల యత్నం

26-03-2025 12:00:00 AM

  • న్యాయవాది హత్యకు నిరసనగా.. 
  • న్యాయవాదుల రక్షణ కోసం చట్టాలు తేవాలని డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (విజయక్రాంతి): నగరంలోని సంతోష్‌నగర్, న్యూమారుతినగర్‌లో సోమవారం జరిగిన న్యాయవాది ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని బండ్లగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాంపల్లి క్రిమినల్ కోర్టు అధ్యక్షుడు రాజ్‌వర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

గతంలోనూ 2021లో మంథనిలో వామనరావు దంపతుల హత్య కేసులో ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. పోలీసులు అరెస్టయిన వారిలో సీనియర్ న్యాయవాది ఎల్ ప్రభాకర్, బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు గంప వెంకటేశం, డీ వెంకటేశ్, రవికిశోర్, జక్కుల లక్ష్మణ్ ఉన్నారు.