calender_icon.png 19 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల చట్ట సవరణ సమీక్షించాలి

19-04-2025 08:18:25 PM

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ డిమాండ్...

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల న్యాయవాద చట్టం 1961 మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని 2025 రూపొందించడంతో న్యాయవాద వృత్తి ప్రమాదకరంలో పడుతుందని,  ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే పార్థసారథి అభిప్రాయపడ్డారు. మామిడి వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రతిపాదించిన సవరణ బిల్లులో బార్ కౌన్సిల్  మనుగడ ప్రశ్నార్థకంగా  మారుతుందని, విదేశీ లాయర్స్ ను అనుమతించడం జరిగిందని అన్నారు.  అమెండ్మెంట్ బిల్లును రద్దుచేసి పాత చట్టాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.

2019 తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఎన్రోల్ చేసుకున్న అడ్వకేట్ లందరికీ హెల్త్ కార్డులను ఇవ్వాలని కోరారు.  ఉన్నత పదవుల్లో ఉన్న జడ్జిలు ఇండ్లలో డబ్బులు సంచులు దొరకడం అవమానకరమని ఆ విధంగా దొరికిన వారిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు కుక్క దువ్వ సోమయ్య, తడక మోహన్,సహాయ కార్యదర్శి బొల్లెపల్లి కుమార్, కోశాధికారి బొడ్డు కిషన్, జిల్లా కమిటీ సభ్యులు ఎండి నేహాల్ యాదసు యాదయ్య, జేల్లా రమేష్, ఎండి ఖయ్యూం, గాదపాక శంకర్, ఆకుల మల్లేశం, పిడుగు ఐలయ్య, జిట్టా భాస్కర్ రెడ్డి, ఎస్ కే హమీద్, తదితరులు పాల్గొన్నారు.