calender_icon.png 29 April, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ బహిష్కరణ బాధితులను పరామర్శించిన న్యాయవాది ప్రభాకర్

29-04-2025 01:08:38 AM

ఏర్గట్ల, ఏప్రిల్ 28: ఏర్గట్ల మండలంలోని తాళ్ళ రాంపూర్ లో గీత కార్మిక కుటుంబాలు గత ఆరు నెలలుగా గ్రామంలో ఎదురుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో  ఆదివారం గౌడ సంఘమును  రాష్ర్ట గీత పని వరాల సంఘము అధ్యక్షులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది  బొమ్మ గాని ప్రభాకర్, రాష్ర్ట గీత పనివారల సంఘము వైస్ ప్రెసిడెంట్ హైకోర్టు సీనియర్ న్యాయవాది రాములు తో పాటు,

జిల్లా అధ్యక్షులు  విఠల్ గౌడ్,  రాష్ర్ట నాయకులు సాయిలు గౌడ్, సిపిఐ నాయకులు  సుధాకర్, ఏఐటీయూసీ  నాయకులు భూమయ్య సందర్శించి  గౌడ సంఘ సభ్యులు ఎదురుకుంటున్న సమస్య లను తెలుకున్నారు. వారి వెంట జిల్లా నాయకులు కోయడి నర్సిములు, రాష్ర్ట నాయకులు ప్రవీణ్ గౌడ్,  రాష్ర్ట కోర్డినేటర్ నాగభూషణం, జిల్లా నాయకులు రమేశ్ గౌడ్, కోటగిరి మండల నాయకులు  శ్రీధర్ గౌడ్, వెంకగౌడ్,  రాజగౌడ్ ఉన్నారు.