19-02-2025 01:35:58 AM
హైకోర్టులో విషాదఛాయలు
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): హైకోర్టులో వాదనలు వినిపిసున్న అడ్వొకేట్ గుండెపోటుతో కుప్పకూలారు. సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెంది నట్లు వైద్యులు నిర్ధారించారు. తెలిసిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం హిల్‌కాలనీకి చెందిన అడ్వొకేట్ వేణుగోపాలరావు దశాబ్దాలుగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.
రోజులాగానే మంగళవారం న్యాయస్థానానికి వచ్చిన వేణుగోపాలరావు భోజన విరమ సమయానికి ముందు 21వ కోర్టు హాలులో ఓ కేసులో తన వాదనలు వినిపిస్తున్నా రు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చి కుప్పకూలారు. దీంతో న్యాయమూర్తి విచారణను నిలిపివేశారు.
సిబ్బంది, తోటి న్యాయవాదులు ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వేణుగోపాలరావు మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. న్యాయవాది మృతితో అత్య వసర, పాస్ ఓవర్ పిటిషన్లు మినహా హైకోర్టు పరిధిలోని ఇతర పిటిషన్లను న్యాయవాదులు నిలిపివేశారు. న్యా యవాది మృతితో హైకోర్టులో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతిపై న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.