నాగల్‌గిద్ధ, ఫిబ్రవరి 4 : రోడ్డు ప్రమా దంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ న్యాయవాది బాల్కి కిషన్ రావు మృతి చెందారు. సంగా రెడ్డి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తు న్నారు.
గత ఐదు రోజుల క్రితం రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. బుధవారం అంత్యక్రియలు స్వగ్రామమైన ఏస్గి, నాగల్గిద్దలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.