calender_icon.png 19 April, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాది బసవరాజ్ సేవలు మరువలేనివి

10-04-2025 01:10:21 AM

వికారాబాద్,ఏప్రిల్ -9ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేసి,అందరిని ఒకే తాటి పైకి తెచ్చేందుకు కృషిచేసిన న్యాయవాది బసవరాజ్ సేవలు మరువలేనివని ట్రస్మా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఎం. నాగయ్య అన్నారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా బసవరాజు ఎంపికైన సందర్భంగా ఆయనను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం తరఫున ఘనంగా సన్మానించారు.

వికారాబాద్ పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్మ నాయకులు మాట్లాడుతూ న్యాయవాది బసవరాజ్ ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘాన్ని స్థాపించి అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చేలా కృషి చేశారని కొనియాడారు. ఆయన న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎంపిక కావడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు N వెంక రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బసవరాజ్ గౌడ్,పట్టణ అధ్యక్షుడు C చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కోశాధికారి తహసీన్, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం. లూయిస్ సభ్యులు గౌస్ పటేల్ ధనిశెట్టి శ్రీనివాస్ శ్రీశైలం సుధీర్, విక్రం రెడ్డి, జై కాంత్ రెడ్డి, మద్దూర్ పాషా, దారుల్ మధు తిరుమలయ్య, అజారుద్దీన్ పాల్గొన్నారు