calender_icon.png 27 November, 2024 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాజ్యాలు అన్యాయం

27-11-2024 08:25:47 PM

ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.కృపాకర్ మాదిగ

ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్దీకరణకు వ్యతిరేకంగా కొందరు మాలలు ఉన్నత న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు వేయడం సామజిక అన్యాయం అని, ఇది అంబేద్కర్ సామాజిక న్యాయస్ఫూర్తికి విరుద్ధమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం.ఆర్.పి.ఎస్) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.కృపాకర్ మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఆందోళనలు, వితండ వాదనలు సాంఘిక ఉగ్రవాదమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు చింత స్వామి మాదిగతో పాటు రాష్ట్రంలోని 20 మాదిగ, ఎస్సీ కుల సంఘాల నాయకులతో కలసి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్సి వర్గీకరణపై వేసిన సబ్ కమిటీని అధికార పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మెడి పాపయ్య ఆరోపించారు.

సుప్రీమ్ కోర్టు ఆమోదించిన ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి నేతృత్వంలో చలో ఢిల్లీ మాలల గర్జన కార్యక్రమానికి పిలుపునియ్యడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునే ఆయా కులాల సంఘాల నాయకులు డిసెంబర్ 14 లోగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ముందు మాదిగ, ఇతర ఎస్సీ-ఏ, బీ గ్రూపుల కులాల ప్రతినిధులు, వ్యక్తులు పిటిషన్ దాఖాలు చేయాలని పిలుపునిచ్చారు. మలలను రెచ్చగొట్టి ప్రభుత్వనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాల ఎమ్మెల్యేలతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో వీరికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు నాగారం అంజయ్య, మురళి, మంగేష్, దుబ్బాక సుభద్ర, గెలువయ్య, బొల్లం జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.