కొండపల్లి శ్రీధర్, (TUDF)జిల్లా కన్వీనర్...
కొత్తగూడెం (విజయక్రాంతి): చట్టపరమైన, రాజ్యాంగపరమైన, ఏజెన్సీ వివాదాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు పూనుకోవడం సుమారు రెండు లక్షల మందికి పైగా ఉన్న ప్రజానీకం కనీస సౌకర్యాలను, ప్రజాస్వామ్య పరిపాలనను దృష్టిలో పెట్టుకోకుండా, పారిశ్రామిక వేత్తలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చే చర్య అని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం (టియుడిఎఫ్) జిల్లా కన్వీనర్ కొండపల్లి శ్రీధర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన నేపథ్యంలో ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ప్రజల భయాందోళనలను, గందరగోళాలను తొలగించాలని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం (పట్టణం) ఆయన డిమాండ్ చేశారు.
షెడ్యూల్ ఏరియాలో మున్సిపాలిటీగా, కార్పొరేషన్ గా ఎన్నికలు నిర్వహించాలంటే ఆర్టికల్ 243 ZC(3) వర్తించకుండా ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు ఉత్తర్వులలో స్పష్టంగా చెప్పారని, ఈ కారణంతోనే పాల్వంచకు గత 25 సంవత్సరాలుగా ఎన్నికలు జరగటంలేదని, దీంతో ప్రజానీకం కనీస సౌకర్యాలు కూడా లేక, ప్రజాస్వామ్యత ప్రజా పరిపాలన లేకుండా అవినీతి, నిధుల దుర్వినియోగం, అధికారుల పాలనలో ప్రజలు మగ్గుతున్నారని, ఇట్టి అనుభవం మన ముందు స్పష్టంగా కనపడుతుందని, ఇట్టి విషయాలు ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిదులకు తెలియని విషయాలు కూడా కాదని, అత్యధిక మంది ప్రజానీకం ఎస్సీ, ఎస్టీ, బీసీకి చెందిన వారని, వీరిలో అత్యధికులు దారిద్య్రరేఖకు(BPL)కి దిగుగా ఉన్నవారేనని, ఇట్టి వీరు కార్పొరేషన్ పనులు భారాన్ని కూడా భరించలేరని, భౌగోళికంగా కూడా లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి ఏజెన్సీలుగా ఉన్నవని, వీటికి అటు రెండు కిలోమీటర్లు ఇటు 2 కిలోమీటర్లు దాటిపోవాల్సి ఉంటుందని, ఏకీకృతంగా లేదని, కొత్తగూడెం మినహా పాల్వంచ, సుజాతనగర్ కొద్దిపాటి భాగం మాత్రమే పట్టణ నేపథ్యం ఉంటుందని ఎక్కువ భాగం గ్రామీణ నేపథ్యంగా ఉందని, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు అధికారం మా చేతిలో ఉంది, మేము ఏదైనా చేస్తాం, రాజ్యాంగం, చట్టాలు మాకు అవసరం లేదు, ప్రజలతో మాకు సంబంధం, లేదంటూ వ్యవహరిస్తే, గతంలోని తప్పులనే తిరిగి కొనసాగిస్తే ప్రజలు సహించే పరిస్థితిలో ఉండరని, ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పునారాలోచన చేయాలని, కార్పొరేషన్ అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కొద్దిమంది కోర్టుకు పోయే పరిస్థితులను నివారించాలని ఆయన డిమాండ్ చేశారు, ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజాల కనీస సదుపాయాలను కోరుకునే వారు, మన మన భవిష్యతరాలను మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ ఐక్య నిర్ణయాలతోటి, ఐక్య ఉద్యమాలకు కలిసి రావలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.