calender_icon.png 27 October, 2024 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ

27-10-2024 12:20:43 AM

పోలీసులపై వేటు

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్ధిఖీ హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపుల నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మార్మోగుతోంది. బిష్ణో య్ వ్యవహారంలో తాజాగా ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసులు సస్పెండయ్యారు. జైలులో ఉన్న అతడిని టీవీ ఇంటర్వ్యూకు అనుమతించి నందుకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2023, మార్చిలో ఒక టీవీ చానెల్‌లో బిష్ణోయ్‌కు సంబంధించిన ఇంటర్వ్యూలు ప్రసారమయ్యాయి. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలు టెలికాస్ట్ అయ్యాయి. దీనిపై పంజాబ్ కోర్టు సిట్‌ను ఏర్పాటు చేయగా.. జైల్ నుంచి వీడియోకాల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చినట్లు గుర్తించారు. ఇంటర్వ్యూకు సహకరించారన్న ఆరోపణలతో పోలీసులపై చర్యలు తీసుకున్నారు. బిష్ణోయ్‌తో పోలీసులు చేతులు కలిపారంటూ అప్పట్లో మూ సేవాలా తండ్రి ఆరోపించారు. బిష్ణో య్ జైల్లోని బ్యారక్‌లోకి సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో  టచ్‌లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.