మలక్ పేట,(విజయక్రాంతి): అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన సంఘటన మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కడ్తాల్ మండలంలో గిరిజన తండాకు చెందిన కావ్య ఎల్బీనగర్ లోని మహాత్మా గాంధీ లా కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతుంది. కావ్య అడ్వకేట్ నవీన్ రెడ్డి వద్ద జూనియర్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. కాగా ఆదివారం రాత్రి కావ్య నవీన్ రెడ్డి అడ్వకేట్ కార్యాలయంలో అనుమానాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందడం కలకలం సృష్టించింది. గిరిజన సంఘాల నేతలు, న్యాయవాదులు మద్దతుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు కావ్య ఇంటిపై పోలీసులు నిష్పక్షపాతంగా సమగ్రమైన దర్యాప్తు చేయాలని కోరి డిమాండ్ చేశారు.